Wordpres బ్లాగ్ ని బ్యాకప్ చేసుకోడానికి టాప్ 8 plugins

Wordpres బ్లాగ్ ని బ్యాకప్ చేసుకోడానికి టాప్ 8 plugins

ఏదైనా ఒక వస్తువు ని క్షణాల్లో నాశనం చేయొచ్చు కానీ దానిని మల్లి ఎదావిధంగా తిరిగి దాని పూర్వ వైభవం తీసుకురావాలి అంటే అంత సులభం కాదు ,అందుకు మన బ్లాగ్స్ కూడా మినహాయింపు కాదు అంటే ఏదైనా బ్లాగ్ క్రాష్ కావడానికి నిముషాలు చాలు అదే బ్లాగ్ ని తిరిగి మల్లి డిజైన్ చేయాలి అంటే చాల సమయం పడుతుంది.ఒకవేళ మనం మన బ్లాగ్ ని ముందు జాగ్రత్తతో బక్కుకుప్ చేసుకుంటే అది ఎన్ని సార్లు క్రాష్ అయినా మనకు ప్రాబ్లెమ్ ఉండదు ఈజీ గా రిస్టోర్ చేసుకోవచ్చు మరి వర్డుప్రెస్సు సైట్ ని బ్యాకప్ చేసుకోడానికి ప్లగిన్స్ ఉన్నాయో రోజు మనం చూద్దాం. 

బ్లాగ్ క్రాష్ కావడానికి గల కారణాలు :

                                           ఒక బ్లాగ్ క్రాష్ అయింది అంటే అది web hosting లో ప్రాబ్లెమ్ వల్ల అయినా కావొచ్చు లేదా వర్డుప్రెస్సు థీమ్ డిస్టరు అవ్వడం వల్ల అయినా కావొచ్చు లేదా వైరస్ ఎటాక్ వల్ల అయినా కావొచ్చు రీసన్ ఏదైనా మన కష్టం ,సమయం  అంత వృధా అయినట్టే. మన కష్టం సమయం వృధా కాకూడదు అంటే మనం మన బ్లాగ్ ని బ్యాకప్ చేసుకుంటే ఉత్తమం.

 

బ్యాకప్ చేసుకోడానికి మనకు అందుబాటులో ఉన్న ప్లగిన్స్ :

1.Backup & Restore DropBox :

                                          బ్యాకప్ & రిస్టోర్ ప్లగిన్ ని మన dropbox అకౌంట్ కి లింక్ చేయాలి దీని ద్వారా మనం మన సైట్ ని సులభంగా బక్కుకుప్ చేసుకోవచ్చు ఆలాగే ఒకవేళ బ్లాగ్ లో ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చిన వర్డుప్రెస్సు dashboard  నుండి మనం బ్యాకప్ ఫైల్ ని డైరెక్ట్ గా రిస్టోర్ చేసుకోవచ్చు.

2 . Backup guard :

                                          Backup Guard అనే ప్లగిన్ బ్యాకప్ చేసుకున్నాక మీరు మీ బ్లాగ్ ని మైగ్రేట్ చేసిన సరే మీరు బ్యాకప్  చేసుకున్న ఫైల్ కాపీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆలాగే ఇందులో pro option తీసుకుంటే షెడ్యూల్ బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్ గా బ్యాకప్ చేసుకోవచ్చు.

3 .Wp-DB Manager :

                                         Wp-DB Manager ప్లగిన్ ద్వారా మనం బ్యాక్యాప్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే ప్రతి సారి మాన్యువల్ గా బ్యాకప్ చేయాల్సిన అవసరం ఉండదు.

4 . Wp Time Capsule :

                                         మన ఇంతకు ముందు చుసిన ప్లగిన్స్ బ్యాకప్ చేసిన ప్రతిసారి మొత్తం సైట్ ని బ్యాకప్ చేస్తాయి కానీ Wp Time క్యాప్సూల్ ప్లగిన్ మాత్రం మనం బ్లాగ్ లో ఎం అయితే చేంజ్ చేసామో చేంజ్ ని మాత్రమే బ్యాకప్ చేస్తుంది అంతే కాకుండా ప్లగిన్ ద్వారా మనం బ్యాక్యాప్స్ ని Dropbox , Google Drive కి ఈజీ గా లింక్ చేసుకోవచ్చు

5.UpDraft  Plus :

                                         UpDraft Plus బ్యాకప్ ప్లగిన్ ద్వారా మనం ఏదైనా వర్డుప్రెస్సు సైట్ ని ఆటోమేటిక్ గా లేదా మాన్యువల్ గా బ్యాకప్ చేసుకోవచ్చు ,బ్యాకప్ ఫైల్స్ ని మనం ఇమెయిల్ ద్వారా అయినా పొందొచ్చు లేదా క్లౌడ్ స్టోరేజ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు.

6 . Wp Data Base Backup :

                                         Wp Database బ్యాకప్ ప్లగిన్ ద్వారా మనం మన వర్డుప్రెస్సు సైట్ ని డైరెక్ట్ గా ఏదైనా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ కి లేదా మెయిల్ కి బ్యాకప్ ఫైల్ ని పొందొచ్చు.

7 .Backup Wp Up :

                                         Backup Wp Up  ప్లగిన్ ద్వారా మనం బ్యాకప్ ని ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే బ్యాకప్ ఫైల్స్ ని zip  లేదా .rar , .tar ఫార్మాట్ లో కి చేంజ్ చేసుకోవచ్చు.

8 .Backup WordPress :

                                        Backup WordPress అనేది సింపుల్ ప్లగిన్ ఇందులో ఎటువంటి సెటప్ లేకుండానే మీరు మొత్తం సైట్ ని బ్యాకప్ చేసుకోవచ్చు బ్యాకప్ ఫైల్ ని ఇమెయిల్ కి కూడా పొందొచ్చు.

                                       వర్డుప్రెస్సు సైట్ క్రాష్ కావడానికి చాల కారణాలే ఉండొచ్చు కానీ చిన్న కారణాల ద్వారా మీ కష్టాన్ని కోల్పోవద్దు అంటే ఫ్రీ ప్లగిన్స్ లో ఏదో ఒకటి యూస్ చేసి మీ వర్డుప్రెస్సు సైట్ ని బ్యాకప్ చేసుకోండి.For more plugin details visit  http://www.wptelugu.com/plugins.

ఒకవేళ మీకు ఆర్టికల్ నచ్చినట్లు అయితే మా ఫేస్బుక్ పేజీ wptelugu లైక్ చేయండి ఆలాగే వర్డుప్రెస్సు ట్యుటోరియల్స్ కోసం యూట్యూబ్ ఛానల్ wptelugu ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *