వర్డుప్రెస్సు థీమ్ డిజైన్ చేంజ్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

wptelugu theme design mistakes

మనుషులకి మనసు అనేది ఒక దగ్గర ఉండదు కంటికి నచ్చిన ప్రతిదీ కావలి అనుకుంటారు అలాగే వెబ్సైట్ లో కూడా నచ్చిన ప్రతి వెబ్సైటు ని డిజైన్ చేయాలి అనుకుంటారు.

ఆన్లైన్ లో ఏదైనా వెబ్సైటు నచ్చితే చాలు అలానే డిజైన్ చేద్దాం అని ఉన్న డిజైన్ మార్చేస్తారు అంటే ఒక దానితో సంతృప్తి చెందకుండా బెటర్మెంట్ కోరుకుంటూనే ఉంటారు.

బెటర్మెంట్ కోరుకోవడం లో తప్పు లేదు మరి ఆ బెటర్మెంట్ కోసం మనం ఏ ఏ తప్పులు చేస్తున్నామో చూద్దాం.
వెబ్సైటు లో బెటర్మెంట్ అంటే థీమ్ చేంజ్ చేయడమో లేదా ప్లగిన్స్ యాడ్ చేయడమో లేదా కంటెంట్ చేంజ్ చేయడం. ఇలా చేంజ్ చేయడం వాళ్ళ ని వెబ్సైటు కి కొత్త లుక్ వస్తుంది ఏమో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక పోతే చేసిన పని, టైం అంత వృధా అవుతుంది.

వర్డుప్రెస్సు లో థీమ్ చేంజ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఏ వెబ్సైటు అయినా ప్రస్తుతం ఉన్న డిజైన్ చేంజ్ చేసేముందు దానిని బ్యాక్ అప్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మొత్తం డిజైన్ చేసాక కొత్త డిజైన్ నచ్చకపోవచ్చు లేదా ఆ డిజైన్ మంచిగా రాకపోవచ్చు లేకపోతే ఏమైనా కంటెంట్ కానీ ప్లగిన్స్ కానీ మిస్ అవొచ్చు అలాంటపుడు బ్యాక్ అప్ ఉంటె ఏ ప్రాబ్లెమ్ ఉండదు,ఎందుకంటే మీకు కొత్త డిజైన్ నచ్చకపోతే మల్లి మీ పాత డిజైన్ రిస్టోర్ చేసుకోవచ్చు.

థీమ్ చేంజ్ చేసేటప్పుడు డిజైన్ మీదనే కాకుండా seo మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే అన్ని థీమ్స్ seo friendly ఉండవ్ కొన్ని రెస్పాన్సివ్ ఉండవ్ కొన్ని కీవర్డ్స్ కి అంత బాగా పని చేయవు ఆలాంటప్పుడు మీరు కరెక్ట్ థీమ్ ఎంచుకోకపోతే పప్పులో కాలు వేసినట్టే. ఒక వేళా మీకు ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్ధం కాకపోతే వర్డుప్రెస్సు కోసం ఎలాంటి థీమ్ ఎంచుకోవాలి అనే ఆర్టికల్ లో చదవండి.

చివరగా వర్డుప్రెస్సు థీమ్ చేంజ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు థీమ్ ఎందుకు చేంజ్ చేస్తున్నాను ఒకవేళ చేంజ్ చేస్తే ఈ థీమ్ ఇంతకు ముందు ఉన్న థీమ్ కన్నా బెటర్ గ ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఏదో చూడగానే నచ్చింది కదా అని చేంజ్ చేసుకోవద్దు.ఎందుకంటే మన ఒక్కరికి నచ్చితే సరిపోదు కదా అందరికి నచ్చాలి.

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగం అనిపిస్తే షేర్ చేయండి,అలాగే మీ సందేహాలను సలహాలను కామెంట్ ద్వారా తెలపండి. ఈ లాంటి ఆర్టికల్ రెగ్యులర్ మిస్ అవ్వొద్దు అనుకుంటే మా ఫేసుబుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *